PM modi: కొవిడ్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated : 10 Sep 2021 21:44 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గురించి కూడా ఈ భేటీలో చర్చించారు. కొవిడ్​ మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. దేశంలో ఇంకా కొవిడ్‌ రెండో దశ ముగియలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ గురువారం వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ సమావేశం నిర్వహించడం గమనార్హం.

దేశంలోని 35 జిల్లాల్లో ఇప్పటికీ వారపు కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే ఉందని రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. మరో 30 జిల్లాల్లో ఈ రేటు 5 నుంచి 10 శాతంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వ్యాక్సిన్‌ అర్హత పొందిన వారిలో ఇప్పటికే సగం మందికి పైగా ఒక డోసు వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తంగా  72 కోట్ల డోసులు వేసినట్లు  కేంద్రం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని