ఇకపై జమ్మూకశ్మీర్‌లోనూ ఆయుష్మాన్‌ భారత్‌

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో శనివారం ప్రధాని నరేంద్రమోదీ ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రారంభించనున్నారు.

Published : 25 Dec 2020 01:40 IST

శనివారం ప్రారంభించనున్న ప్రధాని

దిల్లీ: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో శనివారం ప్రధాని నరేంద్రమోదీ ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత దానిని జమ్మూకశ్మీర్‌, లద్డాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు.  ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని పథకాలు జమ్మూకశ్మీర్‌లో అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 26 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ను జమ్మూకశ్మీర్‌లోని ప్రజలందరికీ అందుబాటులోకి తేనున్నారు. వర్చువల్‌ విధానంలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా పాల్గొననున్నారు. ఈ ఆయుష్మాన్‌ భారత్‌ జమ్మూకశ్మీర్‌ నివాసితులందరికీ ఇకపై వర్తించనుంది. అదేవిధంగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో భాగంగా అందరికీ ఆరోగ్య బీమాను కల్పించనున్నారు. 2018 సెప్టెంబరు 23న ప్రారంభించిన ఈ పథకంలో ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల వరకూ వైద్యసేవలు లభిస్తాయి.

ఇవీ చదవండి..

సీఎస్‌కే అభిమానులకు శుభవార్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని