దిల్లీ గురుద్వారాకు ప్రధాని ఆకస్మిక సందర్శన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు దిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సిక్కు మత బోధకుడు గురు తేజ్ బహదూర్‌కు నివాళులర్పించి.. ఆయన సేవలను స్మరించున్నారు. షెడ్యూల్‌లో లేని పర్యటన కావడంతో.......

Updated : 20 Dec 2020 14:27 IST

ఎలాంటి బందోబస్తు లేకుండానే..

 

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు దిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సిక్కు మత గురువు గురు తేగ్‌ బహదూర్‌కు నివాళులర్పించి.. ఆయన సేవలను స్మరించున్నారు. షెడ్యూల్‌లో లేని పర్యటన కావడంతో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గురుద్వారాకు వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించలేదని వెల్లడించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ ​రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తోన్న తరుణంలో మోదీ గురుద్వారా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ సందర్భంగా తన పర్యటనకు సంబంధించిన విషయాన్ని మోదీ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘గురు తేగ్‌ బహదూర్‌ జీవితం ధైర్యం, కరుణకు ప్రతిరూపంగా నిలుస్తుంది. సమ్మిళిత సమాజం కోసం తేగ్‌‌ బహదూర్‌ చేసిన కృషిని ఆయన అమరుడైన ఈరోజున గుర్తుచేసుకున్నాను. మా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తేగ్‌‌ బహదూర్‌ 400వ ప్రకాశ్‌ పర్వ్‌ రావడం ఆయన దీవెనగా భావిస్తున్నాను. తేగ్‌‌ బహదూర్‌ అంతిమ సంస్కారాలు జరిగిన ఈ పవిత్ర స్థలాన్ని నేడు సందర్శించడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వలే నేనూ ఆయన త్యాగాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని గురుద్వారాను సందర్శించడంతో నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. హడావుడి, బందోబస్తు లేకపోవడంతో అక్కడి సందర్శకులు సైతం మోదీని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయనతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు ఎగబడ్డారు. సాధారణ భక్తుడిలా కారు దిగి ప్రధాని ఒక్కరే గురుద్వారాలోకి నడుచుకుంటూ వెళ్లారు.

ఇవీ చదవండి..

భారత్‌లోనా నుంచి భారత్‌లోనే..

బెంగాలి మావైపే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని