‘ప్రపంచానికి టీకా సహాయం’ ఎంతో గర్వకారణం!

కరోనా టీకా సిద్ధమైతే ప్రపంచదేశాలకు అందించేందుకు భారత్‌ సిద్ధమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇవ్వడం మనమెంతో గర్వించదగిన విషయమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధార్‌ పునావాలా అన్నారు.

Published : 28 Sep 2020 01:20 IST

దిల్లీ: భారత కరోనా టీకా సిద్ధమైతే ప్రపంచదేశాలకు అందించేందుకు‌ సిద్ధమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇవ్వడం ఎంతో గర్వించదగిన విషయమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధార్‌ పునావాలా అన్నారు. ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రపంచదేశాలకు మోదీ ఇచ్చిన ఆ హామీపై ఆయన ప్రశంసలు కురింపించారు. ఈమేరకు ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

‘కరోనా వ్యాక్సిన్‌ సిద్ధమైతే ప్రపంచ దేశాలకు అందజేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని మోదీ హామీ ఇవ్వడం భారత్‌కు ఎంతో గర్వకారణం. మీ నాయకత్వానికి, మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేశం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు భారతీయుల అవసరాలు తీర్చగలవని దీంతో స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. 

ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో శనివారం భారత ప్రధాని నరేంద్రమోదీ 23 నిమిషాల పాటు ప్రసంగించిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభ సమయంలోనూ భారత్‌ 150 దేశాలకు మందుల్ని సరఫరా చేసిందని చెప్పారు. అంతేకాకుండా భారత్‌లో టీకా సిద్ధమైతే కరోనాపై పోరాడేందుకు అందరికీ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని