కొవిడ్‌పై మోదీ అఖిలపక్ష భేటీ ప్రారంభం

దేశంలో కొవిడ్‌ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ భేటీ

Published : 04 Dec 2020 12:26 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ భేటీ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీ గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి సుదీప్‌ బందోపాధ్యాయ్‌, ఎన్సీపీ తరఫున శరద్‌ పవార్‌, తెరాస తరఫున నామా నాగేశ్వరరావు, శివసేన నుంచి వినాయక్‌ రౌత్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. 

దేశంలో కరోనా విజృంభించిన తర్వాత ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్ షా, హర్షవర్ధన్‌, ప్రహ్లాద్‌ జోషీ, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, వి. మురళీధరన్‌ పాల్గొన్నారు. 

కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్‌ పురోగతి, టీకా పంపిణీ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల ఒకేరోజు మూడు నగరాల్లో పర్యటించి టీకా ప్రయోగాలను సమీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో మూడు ఫార్మా సంస్థలతో వర్చువల్‌గా సమావేశమై వ్యాక్సిన్‌ అభివృద్ధిని ఆరా తీశారు. ఈ విషయాలను మోదీ అఖిల పక్ష నేతలకు వివరించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని