పాక్‌పై ఆ దేశవాసులకే నమ్మకం లేదు..!

తమ దేశం సరైన మార్గంలో ప్రయాణించడం లేదని పాకిస్థాన్ ప్రజలు భావిస్తున్నట్లు తాజాగా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రతి ఐదుగురిలో నలుగురు తమ దేశం తప్పుదిశలో పయనిస్తుందని అభిప్రాయపడుతున్నట్లు ఐపీఎస్‌ఓఎస్ అనే రిసెర్చ్‌ కంపెనీ చేసిన సర్వేలో బయటపడింది.

Published : 16 Dec 2020 20:22 IST

దిల్లీ: తమ దేశం సరైన మార్గంలో ప్రయాణించడం లేదని పాకిస్థాన్ ప్రజలు భావిస్తున్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రతి ఐదుగురిలో నలుగురు తమ దేశం తప్పుదిశలో పయనిస్తుందని అభిప్రాయపడుతున్నట్లు ఐపీఎస్‌ఓఎస్ అనే రిసెర్చ్‌ కంపెనీ చేసిన సర్వేలో బయటపడింది. 23 శాతం మంది దేశం సరైన మార్గంలో నడుస్తుందని భావిస్తుండగా..77 శాతం మంది మాత్రం విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో వెయ్యిమందిపై నిర్వహించిన సర్వేలో ప్రజల మనసులో మాట వెలుగులోకి వచ్చింది. కాకపోతే గతేడాదితో పోల్చుకుంటే ఈసారి దేశ నిర్ణయాలపై నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు 21 శాతం మంది సానుకూల అభిప్రాయాన్ని వెల్లడించగా..79 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. 

అలాగే, 36 శాతం మంది తమ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పగా, 13 శాతం మంది బాగా ఉందని, 51 శాతం మంది ఏ సమాధానం ఇవ్వలేదని ఆ సర్వే వెల్లడించింది. అంతేగాక, ప్రావిన్సుల వారీగా ఆర్థిక పరిస్థితి గురించి వివరించింది. అన్నింటిలో పేలవమైన ఆర్థిక పరిస్థితే నెలకొని ఉందని తెలిపింది. తమ ప్రావిన్సుల బలహీన ఆర్థిక పరిస్థితికి పేదరికం, కొవిడ్‌-19, నిరుద్యోగం కారణంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. 

ఇవీ చదవండి:

పాక్‌ నుంచి  ఎన్ని నిధులు అందాయి?ఎవరిచ్చారు?

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని