పాక్‌ దుశ్చర్యను తిప్పికొట్టిన భారత సైన్యం

ఓవైపు చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద భీకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో..

Updated : 05 Sep 2020 13:30 IST

పూంచ్‌: ఓవైపు చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే.. మరోవైపు పాకిస్థాన్‌ సరిహద్దుల్లో తన ఆగడాలు కొనసాగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతూ జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో శనివారం ఉదయం కాల్పులకు తెగబడింది. 9.15 గంటల ప్రాంతంలో సరిహద్దుల్లోని షాపుర్‌, కిర్ని, దెగ్వార్‌ ప్రాంతాల్లో కాల్పులు జరుపుతూ మోర్టార్లతో దాడి చేసింది. కాగా పాక్‌ దుశ్చర్యను భారత సైన్యం తిప్పికొట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని