Published : 04/08/2020 20:35 IST

పాక్‌ వక్రబుద్ధి.. మన భూభాగాలతో కొత్త మ్యాప్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్న ఆ దేశం.. ఇప్పుడు మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. ఇప్పటి వరకు పీవోకే తమదేనని చెప్పుకొంటూ వస్తున్న పాక్‌.. తాజాగా జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని తమ భూభాగాలుగా చూపిస్తూ కొత్త రాజకీయ చిత్రపటాన్ని మంగళవారం విడుదల చేసింది. గుజరాత్‌లోని జునాగఢ్‌‌, మన్వదార్‌, సర్ క్రీక్‌లను కూడా ఆ మ్యాప్‌లో చూపించింది. ఆర్టికల్‌ 370 రద్దుకు రేపటికి ఏడాది పూర్తవుతున్న వేళ ఒక్కరోజు ముందు తన వైఖరిని మ్యాప్‌ రూపంలో తెలియజేసింది. ఇప్పటికే ఆగస్టు 5న బ్లాక్‌డే పాటించాలని నిర్ణయించింది.

కొత్త చిత్రపటం ఆవిష్కరించిన సందర్భంగా ఇమ్రాన్‌ మాట్లాడుతూ.. ఇది పాకిస్థాన్‌ ప్రజల ఆశయానికి అద్దం పడుతోందన్నారు. కేబినెట్‌ ఆమోదించిన ఈ చిత్ర పటాన్ని ఇవాళ ప్రపంచం ముందు ఉంచుతున్నామని చెప్పారు. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని పాఠ్యాంశాల్లో దీన్నే వాడాలని సూచించారు. గతేడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ మ్యాప్‌ను తీసుకొచ్చినట్లు తన వైఖరిని తానే బయట పెట్టుకున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని