రామమందిరంపై పాక్‌ స్పందన ఆశ్చర్యపర్చలేదు

అయోధ్యలో రామ మందిర భూమిపూజ జరిగిన తరుణంలో దాయాది దేశం పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్ గురువారం తీవ్రంగా ఖండించింది.

Published : 06 Aug 2020 17:34 IST

దిల్లీ: అయోధ్యలో రామ మందిర భూమిపూజ జరిగిన తరుణంలో దాయాది దేశం పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్ గురువారం తీవ్రంగా ఖండించింది. మతపరంగా రెచ్చగొట్టే తీరును కట్టిపెట్టాలంది. భారత్ వ్యవహారాల్లో తలదూర్చకుండా దూరంగా ఉండాలంటూ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పాక్‌కు సూచించారు. 
‘భారత్ అంతర్గతమైన అంశంపై ఇస్లామిక్ రిపబ్లిక్‌ ఆఫ్ పాకిస్థాన్ విడుదల చేసిన మీడియా ప్రకటనను గమనించాం. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, మతపరంగా రెచ్చగొట్టే తీరుకు దూరంగా ఉండాలి. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, స్వదేశానికి చెందిన మైనార్టీ వర్గాలకు మతపరమైన హక్కులను దూరం చేసే దేశం నుంచి వచ్చిన ఈ స్పందన ఆశ్చర్యపర్చలేదు. అయినా కూడా అలాంటి వ్యాఖ్యలు తీవ్ర విచారకరం’ అని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన నేపథ్యంలో బుధవారం పాకిస్థాన్‌ విమర్శలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని