వైరస్‌ సోకిన వారూ టీకా తీసుకోవాలి..!

కరోనా వైరస్‌ సోకిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లతో భారత్‌ సంసిద్ధంగా ఉందని చెప్పారు. సీఐఐ ఏర్పాటు.......

Published : 23 Dec 2020 21:25 IST

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల

దిల్లీ: కరోనా వైరస్‌ సోకిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లతో భారత్‌ సంసిద్ధంగా ఉందని చెప్పారు. సీఐఐ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్‌ సమావేశంలో కృష్ణ ఎల్ల మాట్లాడారు. వైరస్‌ సోకిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవాలా? వద్దా? అనే విషయానికి వస్తే ఆయన ఔననే సమాధానం చెప్పారు. ఎందుకంటే వారిలో టీ కణాల ప్రతిస్పందన అవసరమైన మేరకు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అందుకే వైరస్‌ సోకిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు.

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ గురించి ప్రస్తావించిన ఆయన, దేశవ్యాప్తంగా 24 కేంద్రాల్లో ప్రయోగాలు జరుపుతున్నామని కృష్ణ ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రయోగాల కోసం టైర్‌ 1, టైర్‌ 2, టైర్‌ 3 నగరాలను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బయోకాన్‌ ఛైర్మన్‌ కిరణ్‌ మజుందర్‌ షా.. రానున్న రోజుల్లోనూ కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేట్లు చూడాలని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
కరోనా టీకా: తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు