భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఫేజ్‌-3 ప్రయోగాలు

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ ఫేజ్‌-3 ప్రయోగాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ టీకాను దేశీయంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తయారుచేస్తున్న............

Published : 19 Sep 2020 21:18 IST

పుణె: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ ఫేజ్‌-3 ప్రయోగాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ టీకాను దేశీయంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రయోగాలు పుణెలోని ప్రభుత్వ ఆస్పత్రి సస్సూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో వచ్చే వారం ప్రారంభించనున్నట్లు ఆస్పత్రి డీన్‌ డాక్టర్‌ మురళీధర్‌ తెలిపారు. ఇప్పటికే 150 నుంచి 200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొచ్చారని, సోమవారం నుంచి ప్రయోగాలు మొదలయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను బ్రిటీష్‌- స్వీడిష్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోంది. అయితే, ఇటీవల బ్రిటన్‌లో ఈ ప్రయోగాల్లో పాల్గొన్న ఒకరికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) దేశంలో ప్రయోగాలను నిలిపివేయాలని సీరంను ఆదేశించింది. అనంతరం మళ్లీ అనుమతివ్వడంతో ఈ నెల 15 నుంచి ప్రయోగాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మూడో దశ ప్రయోగాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు