జై జై గణేశా: గణపయ్యకు నేతల పూజలు!

దేశంలో కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలంతా వినాయక చవితి వేడుకలను ఈసారి నిరాడంబరంగానే జరుపుకొంటున్నారు. భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే.........

Published : 23 Aug 2020 02:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలంతా వినాయక చవితి వేడుకలను ఈసారి నిరాడంబరంగానే జరుపుకొంటున్నారు. భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పరిమిత సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో కలిసి గణపయ్యకు పూజలు చేశారు. జీవితంలో విఘ్నాలను తొలగించి కరోనా రాకాసి నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకున్నారు. 

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిల్లీలోని తన నివాసంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. తన సతీమణి ఉషా నాయుడుతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక వ్రతకల్పం చదివారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు.  కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. సకల విఘ్నాలు తొలగించేలా వినాయకుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఈ పూజల్లో మంత్రి కేటీఆర్‌ తదితర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 


కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌లోని తన నివాసంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ట్వీట్‌ చేశారు.


మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ఠాక్రే ముంబయిలోని తన నివాసంలో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించారు. 


భాజపా నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ముంబయిలోని తన నివాసంలో వినాయక చవితి వేడుకలు జరుపుకొన్నారు.  కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వినాయక చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకొన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. గోవా ప్రజలందరికీ శుభాలు కలగాలని ప్రార్ధించారు. 


 

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌లోని తన కార్యాలయంలో పూజల్లో పాల్గొన్నారు. అంతకముందు ఆయన శ్రీ మహాశక్తి ఆలయంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుడిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని