అమెరికా ఎన్నికలు: అక్కడ అర్ధరాత్రే ఓటింగ్‌

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. నిజానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ అక్కడి కాలమానం ప్రకారం.. నవంబరు 3 ఉదయం నుంచి పోలింగ్‌ ప్రారంభిస్తాయి. అయితే ఈశాన్య

Published : 03 Nov 2020 14:32 IST

న్యూ హాంప్‌షైర్‌ నుంచి మొదలైన పోలింగ్‌

న్యూ హాంప్‌షైర్‌: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. నిజానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ అక్కడి కాలమానం ప్రకారం.. నవంబరు 3 ఉదయం నుంచి పోలింగ్‌ ప్రారంభిస్తాయి. అయితే ఈశాన్య రాష్ట్రమైన న్యూ హాంప్‌షైర్‌లో మాత్రం అర్ధరాత్రే ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఓటింగ్‌తో అమెరికా ఎన్నికల పోలింగ్‌ మొదలవుతుంది. 

1960 నుంచి హాంప్‌షైర్‌లో ప్రజలు ఇలాగే ఓటేస్తున్నారు. ఈ సారి కూడా నవంబరు 2-3 మధ్య అర్ధరాత్రి దాటిన కాసేపటికి అక్కడ ఓటింగ్‌ జరిగింది. వాటి ఫలితాలు కూడా వచ్చేశాయి. న్యూహాంప్‌షైర్‌లో మొత్తం మూడు టౌన్లు ఉన్నాయి. డిక్స్‌విల్లే నోచ్‌లో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 5 ఓట్లు డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కే పడ్డాయి. ఇక్కడ అధ్యక్షుడు ట్రంప్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. ఒక మరో టౌన్‌ మిల్స్‌ఫీల్డ్‌లో ట్రంప్‌కు 16 ఓట్లు రాగా.. బైడెన్‌కు ఐదు ఓట్లు పోలయ్యాయి. 

ఇక ఈ రాష్ట్రంలోని మరో టౌన్‌ హార్ట్స్‌ లొకేషన్‌ మాత్రం ఈసారి తమ సంప్రదాయాన్ని పక్కనబెట్టింది. కరోనా దృష్ట్యా ఇక్కడి ప్రజలు అర్ధరాత్రి ఓటింగ్‌కు ముందుకు రాలేదు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే నవంబరు 3 ఉదయం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హార్ట్స్‌ లొకేషన్‌లో మొత్తం 48 మంది ఓటర్లు ఉన్నారు. ఇక అమెరికా వ్యాప్తంగా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ అక్కడి కాలమానం ప్రకారం.. నవంబరు 3 ఉదయం 6 గంటలకు మొదలవనుంది. పోలింగ్‌ ముగిసే సమయం మాత్రం ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని