ఆందోళనకరంగానే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని గురువారం ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది.

Updated : 13 Aug 2020 12:02 IST

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని గురువారం ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. ‘ఈ రోజు ఉదయానికి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయన కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ మీదనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అని ఆర్మీ రీసెర్చ్‌, రెఫెరల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో సోమవారం శస్త్రచికిత్స నిర్వహించగా, అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించ లేదు. మరోవైపు ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది. అలాగే తన తండ్రి ఆరోగ్యంపై వస్తోన్న వార్తలు అబద్ధమని శరిష్ఠ్మా ముఖర్జీ వెల్లడించారు. ఆసుప్రతి నుంచి వచ్చే సమాచారం కోసమే తన ఫోన్‌ను ఆన్‌లో ఉంచానని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు