క్షీణిస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం...

గత కొద్ది కాలంగా అస్వస్థతతో ఉన్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలిసింది.

Published : 31 Aug 2020 11:04 IST

దిల్లీ: కొద్ది కాలంగా కోమాలో ఉన్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలిసింది. ఆదివారం రాత్రి నుంచి ఆయన ‘సెప్టిక్‌ షాక్‌’ స్థితిలో ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘‘ ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిన్నటి నుంచి క్షీణిస్తోంది’’ అని ఆయనకు చికిత్స జరుగుతున్న దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి అధికారులు ప్రకటించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సమస్యకు ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. కాగా, ఆయన కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ (84) ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆక్కడ మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా ఆయనకు కొవిడ్‌-19 సోకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని