
నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సన్నాహాలు
నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన లోక్‌సభ స్పీకర్
దిల్లీ: భారత నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త భవనం రక్షణ గోడ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల వల్ల చోటుచేసుకునే దుమ్ము, కాలుష్యాన్ని నిరోధించేందుకు వలలు ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల ఈ ప్రాంగణాన్ని సందర్శించారు. నిర్మాణ కార్యక్రమాన్ని గురించి గుత్తేదారులకు సూచనలు చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు స్పీకర్‌కు వివరించారు. నిర్మాణ పనులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే జరుగుతాయన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన అనంతరం పనులు లాంఛనంగా డిసెంబర్‌లో ప్రారంభిస్తామని వారు వివరించారు. కాగా భవన నిర్మాణం అక్టోబర్ 2022 కల్లా పూర్తి కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement