వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు: మోదీ

కార్గిల్‌ యుద్ధంలో సైనికులు చూపిన ధైర్య పరాక్రమాలు ఎప్పటికీ మరువలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాని కొనియాడారు.

Updated : 26 Jul 2020 13:16 IST

సైనికుల త్యాగాలను కొనియాడిన మోదీ
మన్‌కీ బాత్‌లో దేశప్రజలనుద్దేశించి ప్రసంగం

దిల్లీ: కార్గిల్‌ యుద్ధంలో సైనికులు చూపిన ధైర్య పరాక్రమాలు ఎప్పటికీ మరువలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాని కొనియాడారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమం ద్వారా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. సైనికుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని.. వారి శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. సైనికుల త్యాగాలను దేశంలోని యువకులు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌ కుట్రపూరితంగా భారత్‌ భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయడంవల్లే కార్గిల్‌ యుద్ధం సంభవించిందని విమర్శించారు. భారత్‌ మాత్రం ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోందన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి హెచ్చరించారు. ఈ సందర్భంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. దేశంలో చాలా ప్రాంతాల్లో వైరస్‌ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనావైరస్‌పై‌ పోరాటానికి మరింత సమర్థత అవసరమని మోదీ మరోసారి స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని