గురుగ్రామ్‌కి మకాం మార్చనున్న ప్రియాంక గాంధీ

దిల్లీలోని ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేయాలని నోటీసులు అందిన నేపథ్యంలో ఆ దిశగా ప్రియాంక గాంధీ..

Published : 22 Jul 2020 22:37 IST

త్వరలోనే ప్రభుత్వ గృహాన్ని ఖాళీ చేయనున్నట్లు సమాచారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేయాలని నోటీసులు అందిన నేపథ్యంలో ఆ దిశగా ప్రియాంక గాంధీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపే ఇంటిని ఖాళీ చేయాలని నిశ్చయించుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా ఆమె హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ఇంటికి మారనున్నారు. డీఎల్‌ఎఫ్‌ అరాలియా సెక్టార్‌ 42లోని ఇంటిలో కొన్ని నెలలపాటు ఉండనున్నారు. ముందు నుంచీ ఉత్తర ప్రదేశ్‌లోకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మకాం మారుస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె గురుగ్రామ్‌ని ఎంచుకున్నట్లు ఆమె సన్నిహితులు వెల్లడించారు. లఖ్‌నవూ ఇంటిలో మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. అందుకు మూడు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు ప్రియాంక గురుగ్రామ్‌లో ఉంటారని స్పష్టం చేశారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని