
తోమర్ లేఖను దహనం చేసిన రైతులు
ఇంటర్నెట్ డెస్క్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాలు మద్దతిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను రైతు సంఘాలు ఖండించాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు అఖిల భారత కిసాన్ సమన్వయ సంఘర్ష కమిటీ లేఖ రాసింది. తమ పోరాటం వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకునేలా రైతుల ఆందోళనలు.. చేశాయన్నారు. కీలక అంశాల నుంచి రైతుల దృష్టి మరల్చేందుకు తోమర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలు చిన్న, సన్నకారు రైతులకు మేలుచేస్తాయంటూ వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాసిన లేఖను రైతులు దహనం చేశారు. దిల్లీ-నొయిడా సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో లేఖ ప్రతులను దహనం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ దేశ రాజధాని దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు నేటితో 25వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు వెనక్కి తగ్గడం లేదు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండగా, వాటిల్లో కొన్ని సవరణలు మాత్రమే చేపడతామని ప్రభుత్వం పేర్కొంటోంది. రైతులు, ప్రభుత్వం మధ్య పలుమార్లు చర్చలు జరిగినా సానుకూల ఫలితాలు రాలేదు.
ఇవీ చదవండి...
ఆ చట్టాలను రాత్రికి రాత్రే రూపొందించలేదు..
రైతులకు నిరసన తెలిపే హక్కుంది.. కానీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.