
టెలికం టవర్లు ధ్వంసం చేయొద్దు:పంజాబ్ సీఎం
చండీగఢ్: వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులు టెలికం టవర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 150 చోట్ల టెలికం మౌలిక వసతులను ధ్వంసం చేశారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రంగంలోకి దిగి రైతులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.
చాలా చోట్ల ఈ టవర్లకు విద్యుత్తు పంపే లైన్లను ధ్వంసం చేయడం.. టవర్లను కూల్చేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉద్యోగులపై రైతులు దాడులు చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల టెలికం సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ‘కొవిడ్ విస్తరించిన సమయంలో టెలికం సేవలకు బాధితులకు, ప్రజలకు అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలో రైతులు క్రమశిక్షణతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి అభ్యర్థిస్తున్నారు’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. అంతేకాదు దాడులు, విధ్వంసం వంటివి రైతుల సంక్షేమానికి ఏ మాత్రం ఉపకరించవని పేర్కొన్నారు. ది టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్‌స్ అసోసియేషన్ పరిస్థితిని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.