పండుగ సీజన్‌: రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక

పండుగ సీజన్‌ సమీపిస్తున్న వేళ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభించే ప్రమాదం ఉన్నందున రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్‌) బుధవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ..........

Updated : 27 Feb 2024 16:51 IST

దిల్లీ: పండుగ సీజన్‌ సమీపిస్తున్న వేళ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభించే ప్రమాదం ఉన్నందున రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్‌) బుధవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు రైల్వే స్టేషన్లలోకి వచ్చినప్పుడు, రైళ్లలో, రైల్వే పరిసరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తాము జారీచేసిన నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కొవిడ్‌ కట్టడే లక్ష్యంగా విధించిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రైల్వే చట్టం -1989లోని పలు సెక్షన్ల కింద జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఆర్‌పీఎఫ్‌ కీలక సూచనలివే..
* మాస్క్‌ ధరించకుండా రైల్వే పరిసరాలకు రావొద్దు.

* భౌతికదూరం పాటించాల్సిందే. 

* కరోనా పాజిటివ్‌ అని తెలిసి కూడా రైల్వే స్టేషన్లకు రావొద్దు. రైళ్లలోకి ప్రవేశించొద్దు.   

* కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఇంకా ఫలితం రాకుండా స్టేషన్‌లోకి, రైళ్లలోకి వెళ్లొద్దు. 

* రైల్వే స్టేషన్‌ వద్ద వైద్య బృందం చెకప్‌ చేయడాన్ని నిరాకరించి రైలెక్కినా చర్యలు తప్పవు. 

* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా, చెత్తాచెదారం విసిరేసినా కఠిన చర్యలు.  

* రైల్వే స్టేషన్లు/ రైళ్లలో అపరిశుభ్ర వాతావరణం సృష్టించి.. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దు.

* కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని