వాయుసేన గగన విన్యాసాల్లో రఫేల్‌

భారత వైమానిక దళంలో సరికొత్తగా చేరిన ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాలు త్వరలోనే ప్రజాసందర్శనకు రానున్నాయి. అక్టోబరు 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌లో రఫేల్‌ విమానాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఐఏఎఫ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని

Published : 03 Oct 2020 18:04 IST

దిల్లీ: భారత వైమానిక దళంలో సరికొత్తగా చేరిన ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాలు త్వరలోనే ప్రజాసందర్శనకు రానున్నాయి. అక్టోబరు 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌లో రఫేల్‌ విమానాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఐఏఎఫ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరిగే వైమానికదళ 88వ వార్షికోత్సవ పరేడ్‌లో రఫేల్‌ విమానాలు విన్యాసాలు చేయనున్నట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. 

ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఐదు రఫేల్‌ విమానాలు గత నెల భారత్‌ చేరుకున్నాయి. సెప్టెంబరు 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లద్దాఖ్‌లో పనిచేస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని