పార్లమెంటరీ కమిటీ భేటీ నుంచి రాహుల్‌ వాకౌట్‌

రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వాకౌట్‌ చేశారు. కీలకమైన అంశాలను విడిచిపెట్టడమే కాకుండా తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన బయటకు.....

Published : 16 Dec 2020 20:29 IST

దిల్లీ: రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వాకౌట్‌ చేశారు. కీలకమైన అంశాలను విడిచిపెట్టడమే కాకుండా తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన బయటకు వచ్చేశారు. దేశ రక్షణ వంటి విషయాల్లో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.

పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ జువెల్‌ ఓరం (భాజపా) నేతృత్వంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సమక్షంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి సంబంధించిన యూనిఫాం గురించి చర్చిస్తుండగా.. రాహుల్‌ గాంధీ జోక్యం చేసుకున్నారు.  చైనా దురాక్రమణ, లద్దాఖ్‌ సరిహద్దుల్లో సైనికుల సన్నద్ధత వంటి అంశాలపై చర్చించాలని కోరినట్లు తెలిసింది. అయితే, తనకు మాట్లాడేందుకు ఛైర్మన్‌ అవకాశం ఇవ్వకపోవడంతో రాహుల్‌ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ఆయనతో పాటు ఈ సమావేశానికి హాజరైన ఎంపీలు రేవంత్‌ రెడ్డి, రాజీవ్‌ సతవ్‌ సైతం బయటకొచ్చేశారు.

ఇవీ చదవండి..
తృణమూల్‌లో పెరుగుతోన్న అసమ్మతి..!

ప్రపంచంలో పావువంతు ప్రజలకు టీకా కష్టమే!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని