ఇందిరకు కృతజ్ఞతలు చెప్తూ రాహుల్ నివాళి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఆమెను గుర్తుచేసుకున్నారు.

Updated : 31 Oct 2020 14:52 IST

 

దిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఆమెను గుర్తుచేసుకున్నారు. తనకు మార్గదర్శనం చేసిన నానమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నివాళి అర్పించారు. 1984న ఇదే రోజున దిల్లీలో తన వ్యక్తిగత సంరక్షకుల చేతిలో ఇందిర హత్యకు గురయ్యారు. 

‘అసత్యం నుంచి సత్యం వరకు..చీకటి నుంచి వెలుగు వరకు..మరణం నుంచి జీవితం వరకు..నాకు ఈ పదాల ప్రాముఖ్యతను తెలియజేసినందుకు ధన్యవాదాలు దాదీ’ అంటూ నివాళి అర్పించడంతో పాటు ఇందిర అలనాటి ఫొటోను రాహుల్ ట్విటర్‌లో షేర్ చేశారు. అలాగే, దిల్లీలోని ఇందిర స్మారకమైన ‘శక్తి స్థల్’ వద్ద కాంగ్రెస్ నేత, రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ కూడా తన నానమ్మకు నివాళి అర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు