రైళ్లకు అనుమతించండి.. రైల్వే మంత్రి విజ్ఞప్తి

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కకున్న వలస కార్మికులను తరలించేందుకు ఉద్దేశించిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లకు అనుమతివ్వాలని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్ని రాష్ట్రాలకు.....

Updated : 10 May 2020 19:51 IST

దిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కకున్న వలస కార్మికులను తరలించేందుకు ఉద్దేశించిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లకు అనుమతివ్వాలని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వలస కూలీలందరినీ తరలించేందుకు అవసరమయ్యే రైళ్లను రైల్వేశాఖ నడపనుందని చెప్పారు. ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలంటూ పశ్చిమబెంగాల్‌ను కేంద్ర హోంమంత్రి కోరిన నేపథ్యంలో పీయూష్‌ గోయల్‌ రాష్ట్రాలను కోరడం గమనార్హం.

వలస కూలీలందరినీ తరలించేందుకు ప్రధాని ఆదేశాల మేరకు రైల్వేశాఖ రోజుకు 300 వరకు శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉందని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. కూలీలను మూడు నాలుగు రోజుల్లో వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్రాలన్నీ రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలని ట్విటర్‌ ద్వారా కోరారు. దాదాపు 20 లక్షల మందిని వలస కార్మికులను ఐదు రోజుల్లో వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ 300 రైళ్లు నడిపే సామర్థ్యం రైల్వేశాఖకు ఉందని ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు తక్కువస్థాయిలో రైళ్లకు అనుమతిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు  336 ప్రత్యేక రైళ్లను నడిపామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని