రైల్వే యూజర్‌ ఛార్జీల బాదుడు ఇలా!

విమానాశ్రయాల్లో మాదిరిగా రైల్వే ప్రయాణికులు కూడా యూజర్‌ ఛార్జీలు చెల్లించే సమయం ఆసన్నమైంది. టికెట్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర భారం పడే అవకాశం.......

Published : 28 Sep 2020 19:56 IST

దిల్లీ: విమానాశ్రయాల్లో మాదిరిగా రైల్వే ప్రయాణికులు కూడా యూజర్‌ ఛార్జీలు చెల్లించే సమయం ఆసన్నమైంది. టికెట్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ ఇప్పటికే పూర్తి చేయగా.. త్వరలో కేబినెట్‌ ఆమోదానికి పంపనుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో టికెట్‌ ధరకు అదనంగా యూజర్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

తరగతుల వారీగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. దిగువ తరగతి ప్రయాణికుడికి ఒకలా.. ఏసీ తరగతికి ఒకలా ఈ యూజర్‌ ఛార్జీలు ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రూ.10 నుంచి రూ.35 మధ్య ఈ ధర ఉండనుంది. ప్రస్తుతం దేశంలో 7వేల స్టేషన్లు ఉండగా.. సుమారు 700 నుంచి వెయ్యి స్టేషన్లలో ఈ ఛార్జీల పద్ధతిని ప్రవేశపెట్టనున్నారని సమాచారం. అధిక రద్దీ కలిగి, ఆయా స్టేషన్ల అభివృద్ధి పూర్తయిన తర్వాతే ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు. యూజర్‌ ఛార్జీల గురించి రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని