ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన నళిని

మాజీప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ తాజాగా ఆత్మహత్యయత్నం చేశారు. తమిళనాడు వేలూరు మహిళా జైలులో ఉన్న నళిని, సోమవారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీన్ని గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

Updated : 21 Jul 2020 12:15 IST

వేలూరు: మాజీప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని తాజాగా ఆత్మహత్య చేసుకుంటానని జైలు అధికారులను బెదిరించారు. తమిళనాడు వేలూరు మహిళా జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. గత కొద్ది కాలంగా నళిని జైలు గదిలో ఉన్న తోటి ఖైదీతో మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి తోటి ఖైదీతో మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న జైలు అధికారులతో తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం.

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని గత 29సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. నళినితోపాటు ఆమె భర్త మురుగన్‌ కూడా పురుషుల జైల్లో ఉన్నాడు. గత కొంతకాలంగా బెయిల్‌ కోసం తీవ్రప్రయత్నం చేస్తున్న నళిని, ఈమధ్యే తన కుమార్తె వివాహం సందర్భంగా కొన్నిరోజులపాటు పెరోల్‌పై విడుదలై, తిరిగి జైలుకు వెళ్లారు. 

మాజీప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు నళిని, ఆమె భర్త మురుగన్‌ ఎల్‌టీటీఈ ఉగ్రవాదులతో కలిసి వ్యూహ రచన చేశారు. ఈ కేసులో నళిని, మురుగన్‌ సహా ఏడుగురు దోషులుగా తేలారు. నళినికి తొలుత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఆతర్వాత 2000 సంవత్సరంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని