సంక్రాంతి నుంచి రామమందిరం నిధుల సేకరణ

అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న రామమందిరం నిధుల సేకరణ, అవగాహన కార్యక్రమాల తేదీని శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 14వ తేదీన...

Updated : 16 Dec 2020 06:48 IST

అయోధ్య: అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న రామమందిరం నిధుల సేకరణ, అవగాహన కార్యక్రమాల తేదీని శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 14వ తేదీన ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ట్రస్టు స్పష్టం చేసింది. మాఘ పూర్ణిమ వరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని వెల్లడించింది. నిధుల సేకరణ, అవగాహన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలిపింది. ఆలయ ప్రాముఖ్యత, అయోధ్య ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆలయానికి సంబంధించిన నమూనా ఫొటోలను ఈ సందర్భంగా భక్తులకు పంచిపెట్టనున్నారు.

సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సుప్రీం అనుమతించింది. దీంతో ఆలయ నిర్మాణ పనులను కేంద్రం శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అప్పగించింది. కాగా ఈ ఏడాది ఆగస్టులోనే వైభవంగా ఆలయ శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ పాల్గొని ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఇవీ చదవండి...

గణతంత్ర వేడుకల్లో అయోధ్య రామమందిరం

ధగధగ మెరిసిన అయోధ్య.. గిన్నీస్‌బుక్‌ ప్రశంస

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు