వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించండి: కేంద్రం

కరోనా వైరస్‌ పరీక్షలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్యమైన సూచనలు చేసింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మరోమారు......

Published : 10 Sep 2020 14:53 IST

దిల్లీ: కరోనా వైరస్‌ పరీక్షలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్యమైన సూచనలు చేసింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మరోమారు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది.

‘యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు ఇంకా ఉంటే తప్పనిసరిగా మరోసారి పరీక్షలు చేయాలి. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించాలి. లేదంటే లక్షణాలున్న వ్యక్తి ద్వారా వ్యాధి ఇతరులకు సైతం సోకే అవకాశం ఉంది. రెండోసారి ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహించడం ద్వారా త్వరగా గుర్తించినట్లవుతుంది. అన్ని రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా పాటించాలి. అలా చేయడం ద్వారా వ్యాధిని ఇతరులకు వ్యాప్తి చేయకుండా ఆపొచ్చు’ అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. 95వేల కేసులు నమోదు కాగా, 1,172 వైరస్‌ బారిన పడి మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 44 లక్షలు దాటింది. ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 34 లక్షలకు పైగా చేరకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని