వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా!

రోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచం ముందుకు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చామని ప్రకటించి అందరినీ రష్యా ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశం మరో మందుడుగు వేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు సమాచారం. అక్కడి ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ ఇంటర్‌ఫ్యాక్స్‌ అనే న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

Published : 16 Aug 2020 00:38 IST

ఆగస్టు చివరి నాటికి అందుబాటులోకి..

మాస్కో: కరోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచం ముందుకు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చామని ప్రకటించి అందరినీ రష్యా ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశం మరో మందుడుగు వేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు సమాచారం. అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినట్లు ఇంటర్‌ఫ్యాక్స్‌ అనే న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా చెబుతోంది. మరోవైపు ఈ టీకాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాకుండానే దీన్ని బయటకి తీసుకువస్తున్నారని.. ఇది ఎంతమాత్రం శ్రేయష్కరం కాదని అంటున్నారు.

కొవిడ్‌ను అడ్డుకునే టీకాను ఆవిష్కరించినట్లు ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమార్తె సహా పలువురు టీకా వేయించుకున్నట్టు కూడా ఆయన తెలిపారు. తమ వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నట్లు కూడా ఆ దేశం ప్రకటించుకుంది. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని