
మార్కెట్‌లోకి రష్యా వ్యాక్సిన్
మాస్కో: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ రష్యా మార్కెట్‌లోకి విడుదలైంది. తాము అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. త్వరలోనే దీనిని దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. ‘‘కరోనా వైరస్‌ను నియంత్రించడానికి గమాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ అన్ని రకాల ప్రయోగ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. అందువల్ల దీనిని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం’’ అని రష్యా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనాకు తొలి వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత ఆగస్టు 11న ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమార్తె కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆ సమయంలో వెల్లడించారు. తమ వ్యాక్సిన్ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ వెల్లడించింది.
అయితే ఇప్పటికి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను మాత్రమే విజయవంతంగా పూర్తి చేసుకున్న రష్యా టీకా.. మూడో దశ ప్రయోగాలను భారత్‌లో చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు రష్యా అధికారులు భారత్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు స్పుత్నిక్ మూడో దశ ప్రయోగాలను అనుమతిచ్చాయి. భారత్ కూడా అనుమతిస్తే.. టీకా ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కేవలం క్లినికల్ ట్రయల్స్‌కు మాత్రమే కాకుండా.. ఒక వేళ వ్యాక్సిన్ భారత్‌కు భారీ స్థాయిలో అవసరముంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.