Published : 28/09/2020 15:20 IST

రుణాల మారటోరియంపై విచారణ వాయిదా

సమగ్ర వివరాలు సమర్పించేందుకు గడువు కోరిన కేంద్రం

దిల్లీ: మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. గత విచారణలో కోర్టు కోరిన వివరాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరికొంత సమయం అడిగింది. ఈ మేరకు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్(ఎస్‌జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రుణాల మారటోరియానికి సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై సమగ్ర వివరాలు సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌జీని కోరింది. అయితే, రుణాల వడ్డీ మాఫీ అంశంపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుదిదశలో ఉందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరికొంత గడువు కావాలని కోరారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్రానికి గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. కేంద్రం తన వైఖరి ప్రకటించే వరకు రుణగ్రహీతల ఖాతాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించొద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర మార్గదర్శకాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది.

కరోనాతో ఆదాయాలు తగ్గిన వారికి ఉపశమనం కల్గించేందుకు ఆర్బీఐ మారటోరియం వసతి కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయడం, ఆ వడ్డీపై వడ్డీ విధించడం వల్ల లాభమేమీ ఉండదని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార‌టోరియం వ‌ల్ల రుణాలు చెల్లించే కాల‌ప‌రిమితి మాత్రమే పెరుగుతుంద‌ని, వ‌డ్డీ మాత్రం చెల్లించాల్సిందేనని గతంలో ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తెలపాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ, కేంద్రం కలిసి చర్చించి ఓ ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించింది. దానికి సంబంధించిన సమగ్ర వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని