పండగే.. కానీ ప్రాణం ముఖ్యం: సుప్రీంకోర్టు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జీవితాలను కాపాడుకోవడం కంటే ఏదీ ముఖ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో టపాసుల నిషేధంలో తాము జోక్యం చేసుకోబోమని

Published : 11 Nov 2020 13:55 IST

టపాసుల నిషేధంలో జోక్యం చేసుకోబోమన్న సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జీవితాలను కాపాడుకోవడం కంటే ఏదీ ముఖ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో టపాసుల నిషేధంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. 

పశ్చిమబంగాల్‌లో బాణసంచాను నిషేధిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుర్రాబజార్‌ ఫైర్‌వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌, గౌతమ్‌ రాయ్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. పండగలు ముఖ్యమే అయినప్పటికీ.. ప్రస్తుత మహమ్మారి విజృంభణ నేపథ్యంలో జీవితాలను కాపాడుకోవడమే ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేగాక, స్థానిక పరిస్థితుల గురించి హైకోర్టుకే బాగా తెలుసని, ప్రజలకు ఏది అవసరమో అదే చెబుతుందని వెల్లడించింది. 

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమంతా ప్రాణాల కోసం పోరాడుతున్నాం. ప్రతి ఇంటిలోనూ పెద్దవాళ్లు, వృద్ధులు ఉన్నారు. వారి పట్ల హైకోర్టు జాగ్రత్తగా ఉంటుంది’ అని ధర్మాసనం అభిప్రాయం వెల్లడించింది. కరోనా పరిస్థితుల వేళ జీవన పరిరక్షణకు అందరూ కలిసిరావాలని న్యాయస్థానం కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని