లాలిపాటలు పాడేందుకు వెళ్లలేదు:కాంగ్రెస్ నేత

రెచ్చగొట్టే ప్రసంగాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో దిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి దాఖలు చేసిన అభియోగప్రతంలో పోలీసులు కాంగ్రెస్‌ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పేరును చేర్చారు.

Published : 24 Sep 2020 14:58 IST

అభియోగ ప్రతంలో ఖుర్షీద్ పేరు చేర్చిన పోలీసులు

దిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో దిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి దాఖలు చేసిన అభియోగప్రతంలో పోలీసులు కాంగ్రెస్‌ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పేరును చేర్చారు. 17,000 పేజీలున్న ఆ అభియోగ ప్రతాన్ని సెప్టెంబరు 17న కోర్టుకు సమర్పించారు. దానిలో ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం..‘ఉమర్ ఖలీద్, సల్మాన్ ఖుర్షీద్, నదీమ్ ఖాన్, తదిరులు ఇచ్చిన రెచ్చగొట్టే ప్రసంగాలతో అక్కడి ప్రజలు ముందుకు కదిలారు’ అని ఆరోపించారు. మేజిస్ట్రేట్ ఎదుటే ఈ సాక్ష్యాన్ని రికార్డు చేశారు. 

దీనిపై కేంద్ర మాజీ మంత్రి ఖుర్షీద్ స్పందించారు. ‘మీరు చెత్తను ఏరుతుంటే చాలా మలినాలు దొరుకుతాయి. అందులో ఏదో ఒకటి తీసుకొని వాదనకు బలం చేకూర్చేలా చేయొచ్చు. అసలు ‘రెచ్చగొట్టే ప్రకటన’ అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. నేను అక్కడికి లాలిపాటలు పాడటానికి హాజరయ్యానా లేక రాజ్యంగబద్ధమైన, చట్టబద్ధమైన కారణానికి మద్దతు ఇచ్చానా? ఇది చెత్త ఏరుకొనే ప్రయత్నం. దురదృష్టకరం ఏంటంటే చెత్త ఏరుకొనే వారు వారి పని సరిగా చేయడంలేదు’’ అని దిల్లీ పోలీసులు తన పేరును చేర్చడంపై ఖుర్షీద్‌ విమర్శించారు. చెత్తను ఎత్తి దాని నాణ్యత గురించి ప్రశ్నించొద్దని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఈ జాబితాలో సీపీఎం నాయకురాలు బృందాకారట్‌, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి వారి పేర్లు ఉన్నాయి. కాగా, అల్లర్ల దర్యాప్తును ప్రభుత్వాన్ని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకొని సాగుతుందంటూ దిల్లీ పోలీసుల తీరుపై ఇప్పటికే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని