అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు పొడిగించిన సౌదీ

అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాన్ని మరో వారం పొడిగించినట్టు సౌదీ అరేబియా గత వారం ప్రకటించింది.

Published : 28 Dec 2020 19:19 IST

రియాద్‌: అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు సౌదీఅరేబియా గతవారం ప్రకటించింది. కాగా, ఆదేశం సదరు నిషేధాన్ని మరోవారం రోజుల పాటు పొడిగించింది. బ్రిటన్‌లో మొదలై.. ఇతర దేశాలకూ విస్తరిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

సౌదీఅరేబియాలోకి జల, వాయు, భూ మార్గాల ద్వారా ప్రయాణికులు ప్రవేశించటాన్ని మరోవారం రోజుల పాటు నిషేధిస్తున్నట్టు ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జాన్‌హాకిన్స్‌ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. సౌదీఅరేబియాలో ఇప్పటి వరకు 3,62,220 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త రూపంలో మహమ్మారి విరుచుకుపడకుండా ఆ దేశం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

ఇవీ చదవండి..

విదేశాల నుంచి వస్తే 14 రోజుల క్వారంటైన్‌..

 అమెరికాలో మున్ముందు మరిన్ని చీకటి రోజులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని