హాథ్రస్‌ బాధిత కుటుంబానికి 24 గంటల భద్రత

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్‌ అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబానికి యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా్ట్లు చేసింది. బాధిత కుటుంబం....

Published : 06 Oct 2020 01:57 IST

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్‌ అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబానికి యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బాధిత కుటుంబం ఇంటి చుట్టూ పహారా కాయడమే కాక, కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణగా ఉన్నారని యూపీ హోంశాఖ అధికారులు వెల్లడించారు.

మొత్తం 12 నుంచి 15 మంది కానిస్టేబుళ్లు 24 గంటల పాటు కుటుంబానికి భద్రత కల్పిస్తున్నారన్నారు. బాధితురాలి సోదరుడి వెంట ఇద్దరు కానిస్టేబుళ్లు తోడుంటారని హాథ్రస్‌ పోలీసులు తెలిపారు. కానిస్టేబుళ్లతో పాటు ముగ్గురు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, డీఎస్పీ ర్యాంక్‌ అధికారి ఒకరు బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ బృందంలో మహిళా పోలీసులు సైతం సైతం 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హాథ్రస్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మేజిస్ట్రేట్‌లుకు కూడా అందుబాటులో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని