ఐసీయూలో అహ్మద్‌ పటేల్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్‌ ఆస్పత్రిలో చేరారు. కొద్ది వారాల క్రితం కొవిడ్‌ బారిన పడిన ఆయన తాజాగా గుర్‌గావ్‌లోని మేదంతా.

Published : 15 Nov 2020 17:39 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్‌ ఆస్పత్రిలో చేరారు. కొద్ది వారాల క్రితం కొవిడ్‌ బారిన పడిన ఆయన తాజాగా గుర్‌గావ్‌లోని మేదంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

71 ఏళ్ల పటేల్‌ తాను కొవిడ్‌ బారిన పడినట్లు అక్టోబర్‌ 1న ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు ఫైజల్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం అని ట్వీట్‌ చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారు అయిన అహ్మద్‌ పటేల్‌ త్వరగా కోలుకోవాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆకాంక్షించారు. తన స్నేహితుడు త్వరగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ పార్టీ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని