ఒక వ్యాక్సిన్‌ డోసు మూడు డాలర్లు!

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ధరను మూడు డాలర్లుగా నిర్ణయించినట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) వెల్లడించింది. భారత్ సహా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ధరతో వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు గవి, బిల్‌ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో.............

Published : 08 Aug 2020 01:10 IST

దిల్లీ: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ధరను మూడు డాలర్లుగా నిర్ణయించినట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) వెల్లడించింది. భారత్ సహా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ధరతో వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు గవి, బిల్‌ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఆక్స్‌ఫర్డ్, నోవావాక్స్‌కు చెందిన వ్యాక్సిన్‌లకు 100 మిలియన్ల డోసులను తయారు చేసి, భారత్‌ సహా 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వ్యాక్సిన్లు 2021 మధ్యకల్లా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తరవాత వాటి ఉత్పత్తి పెంచేందుకు సీరమ్ సంస్థ గేట్స్‌ ఫౌండేషన్‌ నుంచి 150 మిలియన్‌ డాలర్ల మూలధనాన్ని పొందనుంది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైరస్‌ను కట్టడి చేయడానికి పేద దేశాలకు తగిన సహకారం అవసరమని సీరమ్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రజల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని