రైతుల నిరసనలు: రాష్ట్రపతిని కలవనున్న పవార్‌

కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 11 రోజులుగా రైతులు చేస్తున్న నిరసనలపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ స్పందించారు. ఈ విషయమై డిసెంబర్‌ 9న ఆయన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

Published : 07 Dec 2020 01:05 IST

ముంబయి: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 11 రోజులుగా రైతులు చేస్తున్న నిరసనలపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ స్పందించారు. ఈ విషయమై డిసెంబర్‌ 9న ఆయన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఎన్సీపీ ప్రతినిధి మహేష్‌ తపసే ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘రైతుల నిరసనల నేపథ్యంలో డిసెంబర్‌ 9న రాష్ట్రపతిని కలిసేందుకు ఎన్సీపీ అధినేత దిల్లీ వెళ్తున్నారు. అందులో భాగంగా ఆయన దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి రాష్ట్రపతికి వివరించనున్నారు. అంతేకాకుండా డిసెంబర్‌ 8న రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు సైతం ఎన్సీపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’ అని ఆయన తెలిపారు.

దేశ రాజధాని సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తమ డిమాండ్లపై ఏకీభవించకపోవడంతో 11వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా డిసెంబర్‌ 8న దేశవ్యాప్త బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రైతు సంఘాలు బంద్‌కు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌ యూనియన్లు సహా పలు ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులను గత సెప్టెంబర్‌లో రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఎన్సీపీ నాయకులు ఆ బిల్లులకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

భారత్‌ బంద్‌కు పెరుగుతున్న మద్దతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని