నిందలు కాదు.. న్యాయం చేయండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెపై అత్యాచారమే జరగలేదంటూ మొన్నటిదాకా పోలీసులు వాదించారు. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతి స్నేహం చేసిందని

Updated : 08 Oct 2020 17:24 IST

‘హాథ్రస్‌’ మలుపులపై ప్రియాంక గాంధీ ట్వీట్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలిపై అత్యాచారమే జరగలేదంటూ మొన్నటిదాకా పోలీసులు వాదించారు. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతి స్నేహం చేసిందని, ఆ విషయాన్ని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ వార్తలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విచారం వ్యక్తం చేశారు. యువతి ప్రవర్తనను కించపరిచేలా వదంతులు సృష్టించడం బాధాకరమన్నారు. బాధితురాలిపై నిందలు వేయడం మాని న్యాయం చేయాలన్నారు. 

‘యువతి ప్రవర్తనను కించపరిచేలా కథనాలు సృష్టించడం, యువతిపై జరిగిన దారుణానికి ఆమెనే బాధ్యురాలి చేయడం అసహ్యంగా ఉంది. హాథ్రస్‌లో ఓ ఘోరం జరిగింది. అందులో దళిత యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యుల సమ్మతి లేకుండానే దహనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితురాలికి దక్కాల్సింది న్యాయం.. నిందలు కాదు’ అని ప్రియాంక ట్వీట్ చేశారు. 

యువతితో తనకు స్నేహం ఉందని, అది ఆమె ఇంట్లో వాళ్లకి నచ్చలేదని నిందితుల్లో ఓ యువకుడు పోలీసులకు చెప్పాడు. అంతేగాక, యువతి కుటుంబసభ్యులే ఆమెను చంపారని నిందితుడు ఆరోపించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు నిందితుల్లో ఒకడైన సందీప్‌ ఠాకూర్‌తో మృతురాలి సోదరుడు అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు నిన్న యూపీ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని