ఇప్పటికీ నమ్మకపోతే ఏం చేయలేం: శివసేన

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య అంటూ ఎయిమ్స్‌ ప్యానెల్ వెల్లడించిన నేపథ్యంలో..శివసేన పార్టీ స్పందించింది.

Published : 06 Oct 2020 01:48 IST

 

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ది ఆత్మహత్య అంటూ ఎయిమ్స్‌ ప్యానెల్ వెల్లడించిన నేపథ్యంలో..శివసేన పార్టీ స్పందించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు కూడా నమ్మదగినది కాకపోతే ఇంక మా దగ్గర మాట్లాడటానికేం లేదంటూ వ్యాఖ్యానించింది. ఎయిమ్స్ ప్యానెల్ ఇచ్చిన నివేదికపై అనుమానం వ్యక్తం చేస్తూ సుశాంత్‌ కుటుంబం కొత్తగా ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు.

‘సుశాంత్ కేసులో ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ మెడికల్ బోర్డుకు నాయకత్వం వహించిన సుధీర్‌ గుప్తా ఈ నివేదికను అందజేశారు. ఆయనకు శివసేన పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు. ఈ కేసులో మొదటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని,  ముంబయి పోలీసుల్ని అపఖ్యాతిపాలు చేసే కుట్ర జరుగుతోంది. ఇప్పుడు ఇక సీబీఐ దర్యాప్తుపై కూడా నమ్మకం లేకపోతే ..ఇంక మేము మాట్లాడటానికేం లేదు’ అంటూ విమర్శించారు.

 కాగా, జూన్‌ 14న అనుమానాస్పద రీతిలో మరణించిన సుశాంత్ సింగ్‌ ఫొటోలు గమనిస్తే అతడిది ఆత్మహత్య కాదని తెలుస్తున్నట్లు ఎయిమ్స్ ప్యానెల్‌లోని వైద్యులు ఒకరు అప్పట్లో తనకు వెల్లడించినట్లు హీరో తండ్రి తరఫు న్యాయవాది వికాస్‌ సింగ్ గతంలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని