
సిద్ధరామయ్య తనయుడికీ కరోనా
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. స్వతహాగా వైద్యుడైన యతీంద్ర.. తనను ఇటీవల కాలంలో కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు. మైసూరు జిల్లాలోని వరుణ నియోజవకర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం సిద్ధరామయ్య బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, సిద్ధరామయ్య చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.