ప్రణబ్‌ ఆరోగ్య స్థితి మెరుగు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడినట్టు ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి.

Published : 20 Aug 2020 15:35 IST

దిల్లీ: పదిరోజులుగా కొవిడ్‌ చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడినట్టు ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ హాస్పిటల్‌‌ వర్గాలు తెలిపాయి. ‘‘ ప్రణబ్‌ ముఖర్జీ శ్వాసకోశ వ్యవస్థ కాస్త మెరుగుపడింది. అయితే, ఆయన ఇప్పటికీ వెంటిలేటర్‌ సహాయంపైనే ఉన్నారు’’ అని ఆస్పత్రి అధికారులు నేడు వెల్లడించారు. ఆయనకు ప్రత్యేక నిపుణుల బృదం పర్యవేక్షణలో వైద్య సేవలందిస్తున్నామని వారు తెలిపారు. 

84 సంవత్సరాల ముఖర్జీ అనారోగ్యం కారణంగా ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మెదడులో కణితిని తొలగించేందుకు అత్యవసర శస్త్రచికిత్స చేసిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకటంతో ప్రణబ్‌ ఆరోగ్య స్థితి క్షీణించినట్టు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని