వారి వెంట్రుకలతో చైనా వ్యాపారం చేస్తోంది..

షింజియాంగ్ ప్రావిన్సులోని వీగర్‌ ముస్లింలపై చైనా ఆకృత్యాలను అమెరికా మరోసారి ఎండగట్టింది.

Updated : 17 Oct 2020 15:23 IST

వీగర్ల నిర్బంధంపై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా 

వాషింగ్టన్: షింజియాంగ్ ప్రావిన్సులోని వీగర్‌ ముస్లింలపై చైనా ఆకృత్యాలను అమెరికా మరోసారి ఎండగట్టింది. వారి విషయంలో మారణహోమానికి ఏమాత్రం తీసిపోని చర్యలకు చైనా పాల్పడుతోందని తీవ్రంగా మండిపడింది. అక్కడి మైనార్టీల స్థితిగతులపై యూఎస్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్ మాట్లాడుతూ..‘అది మారణహోమం కాకపోతే, అలాంటిదే ఏదో జరుగుతోంది’ అంటూ ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో భాగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వీగర్‌ మహిళల జుత్తును తీసివేసి, దాంతో వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసి, వాటిని అమెరికాకు పంపుతోంది’ అంటూ ఓబ్రీన్ మండిపడ్డారు.

ఐరాస అంచనా ప్రకారం.. చైనాలో సుమారు 10 లక్షల మందికిపైగా ముస్లింలు శిబిరాల్లో నిర్బంధంలో ఉన్నారు. వారిని నిర్బంధ కార్మికులుగా మార్చి..అనేక వస్తువులను ఆ దేశం ఉత్పత్తి చేస్తుందన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే కంప్యూటర్ విడి భాగాలు, దుస్తులు, పత్తి, వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.  కాగా, ఈ ఆరోపణలను ఖండించిన చైనా..ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న వారికి వృత్తి, నైపుణ్య శిక్షణ, విద్యా వసతులు కల్పించేందుకే ఈ శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని