సోనియా ఆరోగ్యంపై దిల్లీ కాలుష్యం ఎఫెక్ట్

దేశ రాజధాని దిల్లీ కాలుష్య ప్రభావం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై పడింది. దీర్ఘకాలికంగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోన్న ఆమె కొంతకాలం నగరానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు శుక్రవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Published : 20 Nov 2020 12:25 IST

గోవా లేక చెన్నైలో విశ్రాంతి తీసుకోనున్న కాంగ్రెస్‌ అధినేత్రి!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ కాలుష్య ప్రభావం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై పడింది. దీర్ఘకాలికంగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె కొంతకాలం నగరానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు శుక్రవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆమె గోవా లేక చెన్నైలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరనున్నారని, కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో ఎవరో ఒకరు ఆమె వెంట ఉండనున్నారని తెలిపాయి.

ఛాతీ ఇన్ఫెక్షన్‌ కారణంగా కొంతకాలంగా సోనియా గాంధీ పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ఇన్ఫెక్షన్‌లో తగ్గుదల కనిపించకపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ కాలుష్యం ఆమె అనారోగ్యాన్ని మరింత తీవ్రం చేసిందని, అందుకే కొంతకాలం పాటు బయటి ప్రాంతానికి వెళ్లాలని వైద్యులు సూచించారన్నాయి.

ఈ ఏడాది జులైలో గంగారామ్ ఆసుపత్రిలో సోనియా కొంతకాలం చికిత్స పొందారు. అనంతరం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సెప్టెంబర్‌ 12న అమెరికా వెళ్లారు. అప్పుడు ఆమె వెంట రాహుల్ కూడా ఉన్నారు. అయితే, ఆ సమయంలోనే కరోనావైరస్ విజృంభణను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన వర్షాకాల సమావేశాలకు వీరు హాజరు కాలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని