అమెరికాలో 15 కోట్ల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల పింపిణీ!

త్వరలో అమెరికావ్యాప్తంగా 150 మిలియన్ల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అబోట్‌ ర్యాపిడ్‌ పాయింట్‌-ఆఫ్‌-కేర్‌ కిట్లతో 15 నిమిషాల్లో కరోనాను నిర్ధారించే అవకాశం ఉంటుంది............

Published : 29 Sep 2020 09:40 IST

ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: త్వరలో అమెరికావ్యాప్తంగా 150 మిలియన్ల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అబోట్‌ ర్యాపిడ్‌ పాయింట్‌-ఆఫ్‌-కేర్‌ కిట్లను అన్ని రాష్ట్రాలకు పంపనున్నట్లు వెల్లడించారు. వీటితో 15 నిమిషాల్లో కరోనాను నిర్ధారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం.. విద్యాసంస్థల్ని వీలైనంత త్వరగా పునఃప్రారంభించడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

వీటిలో 50 మిలియన్ల కిట్లను వైద్య సిబ్బంది వంటి వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వారికి కేటాయించనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. మిగిలిన 100 మిలియన్ల కిట్లను ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, విద్యా సంస్థల పునఃప్రారంభానికి మద్దతుగా వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఉదాహరణకు పాఠశాలల్లో వైరస్‌ ముప్పు ఉన్న ఉపాధ్యాయులకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తామని.. వాటికి ఈ ర్యాపిడ్‌ కిట్లు బాగా ఉపయోగపడతాయని వివరించారు. 

గతవారం పూర్తయ్యే నాటికి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 100 మిలియన్ల పరీక్షలు నిర్వహించినట్లు ట్రంప్‌ తెలిపారు. ప్రపంచంలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. తర్వాతి స్థానంలో భారత్‌ ఉందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పాజిటివ్‌ కేసుల నిర్ధారణ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జాన్స్‌ హాప్‌కిన్స్‌ గణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు 71,39,734 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 2,04,967 మంది మృతిచెందారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని