CoronaVaccine: త్వరలో చిన్నారులకూ టీకాలు

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకూ త్వరలోనే టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి! మోడెర్నా వ్యాక్సిన్‌తో పాటు....

Updated : 17 Jun 2021 08:24 IST

పిల్ల కోతుల్లో సమర్థంగా పనిచేసిన రెండు వ్యాక్సిన్లు

న్యూయార్క్‌: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకూ త్వరలోనే టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి! మోడెర్నా వ్యాక్సిన్‌తో పాటు మరో ప్రొటీన్‌ ఆధారిత టీకా ఈ మేరకు ప్రాథమిక ప్రయోగాల్లో సత్ఫలితాలనిచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజా పరిశోధనల్లో భాగంగా వారు 16 పిల్ల కోతులను రెండు బృందాలుగా చేశారు. వాటిలో ఓ బృందానికి మోడెర్నా, మరో వర్గానికి ప్రొటీన్‌ ఆధారిత టీకా అందించారు. రెండు డోసులు అందాక.. వాటన్నింటిలోనూ కొవిడ్‌ కారక ‘సార్స్‌-కొవ్‌-2’ వైరస్‌ను అంతమొందించగల సురక్షిత, బలమైన యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి. 22 వారాలపాటు ఈ యాంటీబాడీ వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేసింది. పెద్ద కోతుల్లో 100 మైక్రోగ్రాముల టీకా డోసుతో వచ్చిన స్థాయిలో యాంటీబాడీలు.. చిన్న కోతుల్లో కేవలం 30 మైక్రోగ్రాముల డోసుతోనే ఉత్పత్తయ్యాయి. మోడెర్నా టీకా తీసుకున్న మర్కటాల్లో.. వ్యాధి తీవ్రతను తగ్గించే బలమైన టీ-సెల్‌ ప్రతిస్పందనలు కూడా కనిపించాయని ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ క్రిస్టీనా డి పార్‌ తెలిపారు. పిల్లల్లో వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని, భద్రతను దెబ్బతీసే టీ హెల్పర్‌ టైప్‌-2 ప్రతిస్పందనలు ఏ టీకాతోనూ ఉత్పన్నమవలేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని