Published : 10/05/2020 20:39 IST

ఒక్కడితో వందలాది మందికి!

సియోల్‌: దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి అనాలోచితంగా చేసిన పనికి వందలాదిమంది కరోనా బారిన పడ్డారు. కరోనాను దక్షిణ కొరియా సమర్థంగా నిలువరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన వ్యక్తి సియోల్‌ నగర సమీపంలోని అనేక నైట్‌క్లబ్బుల్లో తిరిగాడు. దీంతో ఆదివారం ఒక్కసారిగా 34 కేసులు పాజిటివ్‌గా తేలడంతో అక్కడి అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. అన్ని రకాలుగా పరిశోధించి అసలు వాహకుడిని పట్టుకున్నారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.

నైట్‌క్లబ్బులు బంద్‌
ఈ ఉదంతంతో నగరంలోని 2,100 నైట్‌క్లబ్బులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా సోకిన వ్యక్తి సంచరించిన నైట్‌క్లబ్బులకు దాదాపు 7 వేల మంది వచ్చారని అంచనా. వీరందరూ తమకు కరోనా సోకి ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. వీరిని పరీక్షించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా తిరిగి వ్యాప్తి చెందడంపై ఆందోళన చెందకుండా ధైర్యంగా వ్యాధిని ఎదుర్కోవాలని అధికార వర్గాలు కోరాయి. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించడం, సమూహాలకు దూరంగా ఉండటంతో పాటు పరిశుభ్రతను అందరూ పాటించాలని వారు సూచించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని