చమురు ధరల నియంత్రణ పిల్‌ కొట్టివేత

దేశంలో పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించాలని వేసిన..

Published : 09 Sep 2020 01:07 IST

దిల్లీ: దేశంలో పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించాలని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. కష్ట కాలంలో సామాన్యుల మీద భారం వేయకుండా చమురు ధరలు తగ్గించాలంటూ కేరళకు చెందిన షాజి కొడంకన్‌దత్ అనే న్యాయవాది‌ సుప్రీం కోర్డులో పిల్‌ వేశారు. కరోనా కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు మాత్రం దేశంలో ధరలు పెంచుకుంటూ పోతున్నాయని వాదించారు.

ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడిచమురు‌ ధర రూ.38 వరకు ఉందని, దానిని శుద్ధిచేసి, తయారీ ఖర్చులు కలుపుకున్నా విక్రయ ధర లీటర్‌కు రూ.30 కూడా దాటకూడదని షాజి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధర రూ.80 దాటిందని తెలిపారు. కాగా ఆయన వాదనలతో ధర్మాసనం అంగీకరించలేదు. షాజి వేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. దీనిమీద తీవ్రంగా వాదించాలనుకుంటే ఖర్చులు భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో న్యాయవాది ఈ కేసును వెనక్కి తీసుకున్నారు. ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుందని అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని