ప్రశాంత్‌భూషణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ఆయన చేసిన ట్వీట్లపై  కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు ...

Published : 14 Aug 2020 12:06 IST

దిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ఆయన చేసిన ట్వీట్లపై  కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ అరుణ్‌మిశ్రాతో కూడి ధర్మాసనం .. న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధరించింది. ఈకేసులో ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. శిక్ష విధింపుపై ఈనెల 20న వాదనలు వింటామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని